ఆ కంపెనీ తయారు చేసిన కార్ల కంటే..నేను కన్న పిల్లలే ఎక్కువ!

5 Aug, 2022 18:20 IST|Sakshi

టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ తన ట్విట్టర్‌కు మరోసారి పని చెప్పారు.టెస్లా కంపెనీకి కాంపిటీటర్‌గా ఉన్న మరో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ తయారీ సంస్థ లుసిడ్‌ మోటార్స్‌ కంపెనీ పనితీరుపై సెటైర్లు వేశారు. వాళ్లు తయారు చేసిన కార్ల కంటే నేను కన్న పిల్లలే ఎక్కువ మంది ఉన్నారని వ్యాఖ్యానించారు.  

అమెరికాకు ఈవీ కార్ల తయారీ సంస్థ 'లుసిడ్‌ మోటార్స్‌' క్యూ2 ఫలితాల్ని విడుదల చేసింది. క్యూ2లో తమ సంస్థ 679 కార్లను డెలివరీ చేసినట్లు తెలిపింది. ఈ ఫలితాలపై లుసిడ్‌ మోటార్స్‌ను ఉద్దేశిస్తూ మస్క్‌ ట్వీట్‌ చేశారు. 'క్యూ2 లో వాళ్లు తయారు చేసిన కార్ల కంటే నేను కన్న పిల్లలే ఎక్కువ' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌లు వైరల్‌గా మారాయి. 

లూసిడ్‌ నాలిక్కరుచుకుంది
క్యూ2లో లూసిడ్‌ మోటార్స్‌ డెలివరీ చేసింది 679 కార్లని ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేయడంపై ఆ సంస్థ నాలిక్కరుచుకుంది. మొదటి సారి తయారు చేసిన కార్ల సంఖ్యని తగ్గించింది. సప్లయ్‌ చైన్‌ సమస్యలు, ద్రవ్యోల్బణం కారణంగా తక్కువ కార్లను తయారు చేసినట్లు లూసిడ్ సీఈఓ పీటర్ రావ్లిన్సన్ తెలిపారు.  

కార్లలో రారాజు టెస్లా 
ఎలక్ట్రిక్‌ కార్లలో టెస్లా రారాజు అని మస్క్‌ మరోసారి నిరూపించారు. క్యూ2లో టెస్లా 258,000 వెహికల్స్‌ తయారు చేసింది. 254,000 వాహనాల్ని డెలివరీ చేసింది. సప్లయ్‌ చైన్‌ సమస్యల కారణంగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేశామని లేదంటే ఎక్కువ కార్లను ఉత్పత్తి చేసేవాళ్లమని మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

వివాదాల్లో ఎప్పుడూ ముందే 
మస్క్‌ తన ట్వీట్‌లతో వివాదాల్లో ఎప్పుడూ ముందంజలో ఉంటారు. ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆర్ధిక వ్యవస్థ కలిగిన జపాన్‌లో గత కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల రేటు భారీగా పడిపోతుంది. 2008లో జనాభా పెరుగుదల గరిష్టంగా నమోదైన జపాన్‌లో గతేడాది 6లక్షల జనాభా తగ్గిపోయింది. గతేడాది అక్కడ 8.3లక్షల జననాలు నమోదు కాగా 14.4లక్షల మరణాలు సంభవించాయి.

ఈ తరుణంలో ఓ సదస్సులో పాల్గొన్న ఆయన.. అధిక సంతానం పర్యావరణానికి హానికరమని ఎవరు చెప్పారు? అర్ధం లేని వాదన. జనాభా ఎక్కువగా ఉన్నా.. పర్యావరణంగా బాగానే ఉంటుంది. నాగరిక క్షీణించి పోవడాన్ని చూస్తూ ఉండలేం. చూడండి జపాన్‌లో జననాల రేటు తక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు