కరోనాతో ఆర్ధిక అవగాహన పెరిగింది

17 Aug, 2021 10:58 IST|Sakshi

న్యూఢిల్లీ: భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక సన్నద్ధత విషయమై గడిచిన రెండేళ్ల కాలంలో వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లినట్టు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ తెలిపింది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఆర్థిక అవగాహన, బీమా ప్రాధాన్యం పెరిగినట్టు పేర్కొంది. ‘లైఫ్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ 2021’ పేరుతో ఒక నివేదికను సోమవారం విడుదల చేసింది. తమ ఆర్థిక ప్రణాళికలు సరిపడా లేనట్టు ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపింది. ఈ సూచీ 2019తో పోలిస్తే 4.5 పాయింట్లు తగ్గినట్టు పేర్కొంది.‘‘ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఉద్యోగ భద్రత, ఆదాయ క్షీణతతో రుణ భయం ఈ మూడు ప్రధాన అంశాలు విశ్వాసం సన్నగిల్లేందుకు కారణం’’ అని ఈ నివేదిక తెలియజేసింది.

ముఖ్యాంశాలు...

టైర్‌–1, టైర్‌–2 పట్టణాలతో పోలిస్తే మెట్రోలలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కుగా ఉంది. చిన్న కుటుంబాలు మరింత ఇబ్బందులు పడ్డాయి. సంక్షోభ సమయంలో ఉమ్మడి కుటుంబాలు (మద్దతు వల్ల) కొంచెం గట్టిగా  నిలబడ్డాయి.90 శాతం మంది వేతనకోతలు, వ్యాపార నష్టాన్ని ఎదుర్కొన్నారు.

కరోనాతో జీవితానికి రక్షణ అవసరమన్న అవగాహన పెరిగింది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై అవగాహన 11 పాయింట్లు పెరగ్గా.. ఎండోమెంట్, యులిప్‌ల విషయంలో 10 పాయింట్లు పెరిగింది. కరోనా మొదటి దశ తర్వాత 41 శాతం మంది (సర్వేలో పాల్గొన్న 1987 మందిలో) టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు.  

చదవండి : ఒక్క రోజులో లక్ష స్కూటర్ల విక్రయం

మరిన్ని వార్తలు