అదానీ వెంటే ఇన్వెస్టర్లు.. అందరికీ లాభాలే లాభాలు!

16 May, 2022 12:19 IST|Sakshi

అదానీ ప్రస్తుతం ఇండియన్‌ బిజినెస్‌ వరల్డ్‌ లోనే కాదు ఏషియా బిజినెస్‌ సర్కిళ్లలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. దూకుడైన వ్యాపార వ్యూహాలతో జెట్‌ స్పీడ్‌తో అదానీ కంపెనీలు దౌడు తీయిస్తున్నారు ఆ కంపెనీల సీఈవో గౌతమ్‌. తాజాగా ప్రపంచంలోనే పెద్ద సిమెంట్‌ కంపెనీల్లో ఒకటైన హోల్సిమ్‌ గ్రూప్‌కి చెందిన అంబుజా, ఏసీసీ సిమెంటులను ఆయన టేకోవర్‌ చేశారు.

శుభశకునాలే!
భారీ సిమెంట్‌ కంపెనీలను గౌతమ్‌ అదానీ టేకోవర్‌ చేయడంతో ఒక్కసారిగా గౌతమ్‌ అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలకు రెక్కలు వచ్చాయి.  దీనికి తోడు త్వరలోనే భారత ప్రభుత్వం ఇన్‌ఫ్రా రంగంపై భారీగా ఖర్చు చేయబోతున్నట్టు మార్కెట్‌ నిపుణులు అంచనాలు వెలువరించారు. దీంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టు అదానీ కంపెనీల షేర్లు లాభాల్లోకి వచ్చాయి. 

రెండు గంటల్లోనే
సోమవారం మార్కెట్‌ ఆరంభమైన తర్వాత ఈ కంపెనీల షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. మార్కెట్‌ ఆరంభమైన రెండు గంటల వ్యవధిలోనే ఈ గ్రూపుకు చెందిన కంపెనీల షేర్లు కనిష్టంగా ఒక శాతం నుంచి గరిష్టంగా ఐదు శాతం వరకు వృద్దిని నమోదు చేశాయి. ఒక్క ఎనర్జీ సెక్టార్‌ మినహా ప్రతీ కంపెనీ షేర్లు దౌడు తీస్తున్నాయి. మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం కేవలం రెండు గంటల్లోనే అదానీ కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించగలిగాయి. 

మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేశీ స్టాక్‌ ఎక్సేంజీలలో అదానీ గ్రూపులో వివిధ కంపెనీల షేర్లు ఇలా ఉన్నాయి.
- అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ షేరు ధర రూ. 40 పెరిగి రూ. 2094 దగ్గర ట్రేడవుతోంది. వృద్ధి 1.96 శాతంగా నమోదు అయ్యింది.
- అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌జోన్‌ లిమిటెడ్‌ షేరు 0.86 వృద్ధిని నమోదు చేసింది. ఒక్కో షేరు ధర రూ.6.10 పెరిగి రూ. 712 దగ్గర ట్రేడవుతోంది.
- అదానీ పవర్‌ షేరు ఏకంగా 4.99 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక్కో షేరు ధర రూ.12.70 వంతున పెరిగి రూ. 267.35 దగ్గర నమోదు అవుతోంది.
- అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు ధర రూ.61.30 వరకు లాభపడింది. 2.82 శాతం వృద్ధితో రూ.2231 దగ్గర ట్రేడవుతోంది.
- అదానీ విల్మర్‌, అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. 
- అదానీ ట్రా‍న్స్‌మిషన్‌ షేరు మాత్రం స్వల్ప నష్టాల్లో ఉంది. 1.20 శాతం క్షీణతతో ఒక్కో షేరు విలువ రూ.26 తగ్గి రూ.2161 దగ్గర ట్రేడవుతోంది.
-అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ షేరు కూడా నష్టాల్లో ఉంది.  ఒక్కో షేరు ధరలో రూ.43 కోతకు గురైంది. రూ.2325 దగ్గర నమోదు అవుతోంది.

చదవండి: అదానీ చేతికి హోల్సిమ్‌ ఇండియా

మరిన్ని వార్తలు