యువత కోసం మార్కెట్లోకి హోండా గ్రాజియా లిమిటెడ్‌ ఎడిషన్‌ స్కూటర్

16 Nov, 2021 17:45 IST|Sakshi

ఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామిగా ఉన్న హోండా మోటార్‌ సైకిల్ ఇండియా మార్కెట్లోకి గ్రాజియా 125 సీసీ రెప్సోల్‌ హోండా టీమ్‌ ఎడిషన్‌ స్కూటర్‌ను లాంచ్ చేసింది. గుర్గావ్‌ ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.87,138 ఉంది. రెప్సోల్‌ హోండా రేసింగ్‌ టీమ్‌ డిజైన్‌ థీమ్, గ్రాఫిక్స్‌ స్ఫూర్తితో గ్రేజియా 125 రెప్సాల్‌ హోండా టీమ్‌ ఎడిషన్‌ను రూపొందించినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్‌, సీఈఓ అత్సుషి ఒగాటా వెల్లడించారు. ఈ స్కూటర్‌ను దేశీయంగా యువత ఔత్సాహికుల కోసం విడుదల చేసినట్లు తెలిపారు.

ప్రోగ్రామ్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌((పీజీఎం-ఎఫ్‌ఐ) ఇంజన్, ఐడ్లింగ్‌ స్టాప్‌ వ్యవస్థ, ఎన్‌హాన్స్‌డ్‌ స్మార్ట్‌ పవర్‌ (ఈఎస్‌పీ), మల్టీ-ఫంక్షన్‌ స్విచ్‌, ఇంజిన్‌-కటాఫ్‌తో సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌, మూడు దశల్లో సర్దుబాటు చేసే రేర్‌ సస్పెన్షన్‌, ఫ్రంట్‌ టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌ వంటి సదుపాయాలు ఈ స్కూటర్‌ను రూపొందించారు.

(చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!)

మరిన్ని వార్తలు