ఇళ్ల కొనుగోలు దారులకు భారీ షాక్‌!

26 Apr, 2022 14:44 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బెంగళూరు, ముంబై, పుణే, హైదరాబాద్‌ తదితర నగరాల్లో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్, రిసర్చ్‌ (ఇండ్‌–రా) తెలిపింది. కస్టమర్ల నుంచి డిమాండ్‌ రావడమే ఇందుకు కారణమని వెల్లడించింది. 

‘ప్రస్తుతం గృహాల అమ్మకాలు దూసుకెళ్లడం, పెరిగిన డిమాండ్‌ తుది వినియోగదారు ఆధారితమైంది. ఊహాజనితమైనది కాదు. అందువల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 6 శాతం అధికం అయ్యాయి.

 దీర్ఘకాలిక క్షీణత తర్వాత గత కొన్ని సంవత్సరాలలో ధరలు స్థిరంగా ఉన్నాయి. 2022–23లో గృహాల విక్రయాలు 12 శాతం దూసుకెళ్తాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం అమ్మకాల్లో అందుబాటు ధర గృహాల వాటా 50 శాతం ఉంటుంది’ అని ఇండ్‌–రా వివరించింది. 
 

>
మరిన్ని వార్తలు