వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత?

26 Jul, 2021 15:11 IST|Sakshi

కరోనా మహమ్మారి లాంటి విపత్కర కాలంలో చాలా మంది ప్రజలు అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం వడ్డీరేట్లు తగ్గాయని చెప్పుకోవాలి. అయితే, ప్రజలకు అందించే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఇతర రుణాల వడ్డీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.

హోమ్ లోన్, కారు లోన్, గోల్డ్ లోన్ లతో పోలిస్తే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఈ రుణాల కోసం ఎటువంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి ప్రాసెసింగ్ ఫీజ్, జీఎస్ టీ ఫీజ్ ఎంత ఉన్నాయి అనేది తెలుసుకుంటే మంచిది. ప్రస్తుతానికి కొన్ని బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు లక్ష రూపాయలకు 5 ఏళ్ల కాలానికి ఎంత అనేది ఈ క్రింద తెలుసుకోండి.

మరిన్ని వార్తలు