బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతాదారులకు అలెర్ట్‌, అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు!

9 Oct, 2023 21:18 IST|Sakshi

ఖాతాదారులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల వరకు ఉన్న  ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీరేట్లను పెంచింది. దీంతో ఎఫ్‌డీ చేసిన  సాధారణ ఖాతాదారులు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్‌ సిటిజన్లు 7.75 శాతం వడ్డీని పొందవచ్చు.


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వడ్డీ రేట్లు 
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సవరించిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడు రోజుల నుంచి 14 రోజుల టెన్యూర్‌ కాలానికి 3 శాతం, 15 రోజుల నుంచి 45 రోజుల కాలానికి 3.50శాతం పెంచింది. 4.5 శాతం ఉన్న వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 46 నుంచి 180 రోజుల టెన్యూర్‌కు 5శాతం వడ్డీని, 181 నుంచి 210 టెన్యూర్‌ కాలానికి 5.50 శాతం,211 నుంచి 270 కాలానికి 6 శాతం, 271 నుంచి ఏడాది లోపు వడ్డీ రేట్లను 6.25 శాతం అందిస్తుంది. 

అయితే, 399 రోజుల కాలవ్యవధి గల ‘బరోడా తిరంగా ప్లస్‌’డిపాజిట్‌ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.25 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు  2023 అక్టోబర్‌ 9 (నేటి) నుంచి అమల్లోకి వచ్చాయి. 
 

మరిన్ని వార్తలు