రూ.29 వేలకే హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్‌..స్పెసిఫికేషన్లు, ఫీచర్లివే

14 Mar, 2023 16:04 IST|Sakshi

ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌పీ అతి తక్కువ ధరకే క్రోమ్‌బుక్‌ ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేసింది.హెచ్‌పీ క్రోమ్‌ బుక్‌ 15.6 అని పిలిచే క్రోమ్‌బుక్‌లో సెలెరాన్ N4500 ఆధారిత ప్రాసెసర్‌ ఉండగా.. మార్కెట్‌లో లభ్యమవుతున్న ఈ ల్యాప్‌టాప్‌ను స్కూల్‌, కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు హెచ్‌పీ వెల్లడించింది.

ఈ ల్యాప్‌ట్యాప్‌లో పెద్ద డిస్‌ప్లే, వైఫై 6 సపోర్ట్‌తో బలమైన కనెక్టివిటీ (stronger connectivity),11.5 గంటల బ్యాటరీ ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా హెచ్‌పీ క్రోమ్‌బుక్‌పై హెచ్‌పీ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ బేడీ మాట్లాడుతూ.. హైబ్రిడ్ లెర్నింగ్ విధానం అందుబాటులోకి రావడంతో పర్సనల్‌ కంప్యూటర్‌ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువుగా మారింది. అందుకే స్టైలిష్, శక్తివంతంగా ఉన్న ఈ క్రోమ్‌ బుక్‌ విద్యార్ధులకోసం ప్రత్యేకంగా ఈ క్రోమ్‌ బుక్‌ 15.6 ల్యాప్‌ట్యాప్‌ను డిజైన్‌ చేసినట్లు తెలిపారు. ఇంట్లో లేదా క్లాస్‌ రూమ్‌లో చదువుతున్నా కనెక్టివిటీ, ప్రొడక్టీవ్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. 

HP Chromebook 15.6 ధర
HP Chromebook 15.6 ప్రారంభ ధర రూ. 28,999కే లభిస్తుంది. ఫారెస్ట్ టీల్, మినరల్ సిల్వర్‌తో సహా రెండు వేరియంట్‌ కలర్స్‌తో అందుబాటులో ఉంది.

HP Chromebook 15.6 స్పెసిఫికేషన్‌లు
HP Chromebook మైక్రో-ఎడ్జ్ బెజెల్స్‌తో 15.6 ఇమ్మర్సివ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మైక్రో ఎడ్జ్‌ బెజెల్స్‌, 250 నిట్స్‌ వరకు పీక్‌ బ్రైట్‌నెస్‌, ముందు భాగంలో వీడియో కాల్స్‌ మాట్లాడేందుకు వీలుగా వైడ్ విజన్ హెచ్‌డీ కెమెరా ఉంది. వీటితో పాటు స్పీకర్ ఎన్‌క్లోజర్ డిజైన్‌తో పెద్ద డ్యూయల్ స్పీకర్‌లు ఉన్నాయి.

 దీంతో పాటు గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ క్లాస్‌రూమ్‌తో పాటు ఫైల్స్‌, ఫొటోలను తొందరగా పంపిచటానికి హెచ్‌పీ క్విక్‌ డ్రాప్‌ సదుపాయం ఉంది. ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో నియర్‌బై షేర్‌ మాదిరిగానే పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365కు ఈ ల్యాప్‌టాప్‌ లో వినియోగించుకోవచ్చు. ఇక ఈ హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ను 15.6ను నదులు, తీర ప్రాంతాల నుంచే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలిసే ప్లాస్టిక్‌తో, రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు