డాలర్ల కోసం బ్యాంకర్ల డిమాండ్‌

16 Sep, 2020 11:14 IST|Sakshi

ముంబై:  ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో మంగళవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 16 పైసలు తగ్గి 73.64 వద్ద ముగిసింది. బ్యాంకర్లు, చమురు దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్లకు భారీ డిమాండ్‌ దీనికి కారణం. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... సోమవారం రూపాయి ముగింపు 73.48. మంగళవారం 73.33 వద్ద సానుకూలంగానే ట్రేడింగ్‌ ప్రారంభమైంది. అయితే డాలర్ల కోసం భారీ డిమాండ్‌తో  ఒక దశలో 73.72 కనిష్టానికి కూడా చూసింది. రోజంతా ఈ శ్రేణి (73.33–73.72)లోనే రూపాయి తిరిగింది.   పోర్టిఫోలియో ఇన్‌ఫ్లోల (ఈక్విటీల్లో విదేశీ అమ్మకాలు) పరిస్థితుల్లో డాలర్ల అవసరాల రీత్యా ఆర్‌బీఐ తరఫున బ్యాంకులు డాలర్లు కొనుగోలు చేస్తున్నట్లు  భావిస్తున్నట్లు ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. (నేడు ప్రతికూల ఓపెనింగ్‌?! )

ఇక చమురు దిగుమతిదారుల నుంచి కూడా డాలర్లకు డిమాండ్‌ ఉన్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌లో సీనియర్‌ రిసెర్చ్‌ విశ్లేషకులు (కమోడిటీ అండ్‌ కరెన్సీ) జితిన్‌ త్రివేది తెలిపారు. 73.40–73.50 మధ్య రూపాయి నిలకడగా ఉండడానికి ఆర్‌బీఐ ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని పేర్కొన్నారు. అయితే సమీప భవిష్యత్తులో 73.90–74.10 వరకూ రూపాయి వెళ్లే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. ఇక అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై భారీ క్షీణ రేట్ల అంచనా కూడా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోందని నిపుణుల అంచనా.  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ). 73.83 వద్ద నిరోధం, 73.20 వద్ద మద్దతు ఉందని హెచ్‌డీఎఫ్‌సీ రిటైల్‌ రిసెర్చ్‌ డిప్యూటీ హెడ్‌  దేవర్షి వకీల్‌ పేర్కొన్నారు. (ఎస్‌బీఐ ఏటీఎంకు మొబైల్‌ తీసుకెళ్లండి!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా