మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌!

13 May, 2021 09:37 IST|Sakshi

దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆసక్తికి అనుగుణంగా మార్కెట్లోకి కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా స్వీడిష్ కి చెందిన ఆస్ట్రియన్ కంపెనీ హుస్క్వర్నా మోటార్ సైకిల్స్ కూడా వచ్చి చేరింది. ఈ సంస్థ 2018 సంవత్సరంలో 6.7-హెచ్‌పీ మినీబైక్‌ను ఆవిష్కరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ-పీలెన్ అనే బైక్‌తో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. 

తాజాగా ఆస్ట్రియా ప్రధాన కార్యాలయ సంస్థ వెక్టోర్ అనే పేరుతో వెక్టార్ మోడల్‌తో కొత్త బ్యాటరీ స్కూటర్‌ను సంస్థ ఆవిష్కరించింది. ఈ సంస్థ తన బ్రాండ్ పేరుతో ఆవిష్కరించిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇది వస్తుంది. పట్టణ ప్రాంతాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను రూపొందించారు. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు, పెరుగుతున్న ఇంధన ధరలకు ఈ బైక్ చెక్ పెట్టనుందని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ వెక్టార్ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. సుమారు 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుందని కంపెనీ చెబుతోంది. 

కంపెనీ తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా మొదట జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో తీసుకురావాలని యోచిస్తుంది. అయితే, హుస్క్వర్నా తన ఎలక్ట్రిక్ స్కూటర్ వెక్టర్ ను ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు. కానీ వినిపిస్తున్న ఊహాగనాల ప్రకారం, వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొని రావచ్చు అని అంచనా. వెక్టోర్ ఒక ప్రత్యేకమైన వృత్తాకార హెడ్‌లైట్‌ను కలిగి ఉంది, రెండు వైపులా ఫెయిరింగ్ మరియు పసుపు రంగు స్ట్రోక్‌లతో రెండు-టోన్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది. వెక్టార్ స్కూటర్‌పై అత్యధికంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

చదవండి:

Petrol Price: సెంచరీ కొట్టేసిన పెట్రోలు ధరలు

మరిన్ని వార్తలు