బ్లాక్‌ చెయిన్‌.. మెటావర్స్‌.. క్రిప్టో టోకెన్లు.. కొత్త గేమ్‌ తెస్తోన్న హైదరాబాద్‌ స్టార్టప్‌

26 Feb, 2022 12:08 IST|Sakshi

హైదరాబాద్‌ బేస్డ్‌ స్టార్టప్‌ గేమింగ్‌ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనాలకు తెర తీస్తోంది. బ్లాక్‌ చెయిన్‌ , మెటావర్స్‌ టెక్నాలజీను అనుసంధానం చేస్తూ సరికొత్త గేమ్‌ని రూపొందించింది. ఈ గేమ్‌లో హై లెవల్స్‌కి వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్లను బహుమతిగా గెలుచుకోవచ్చు. ఇలా గెలుచుకున్న టోకెన్లను క్రిప్టో ఎక్సేంజీల్లో సొమ్ము చేసుకోవచ్చు. యూత్‌ టార్గెట్‌ చేసి మరీ ఈ గేమ్‌ని మార్కెట్‌లోకి తెస్తున్నారు. 

హైదరాబాద్‌కి చెందిన బ్లాక్‌ చెయిన్‌ స్టార్టప్‌ క్లింగ్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ యాక్సే ఇన్ఫినిటీని స్ఫూర్తితో సరికొత్త గేమ్‌ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి బీటా వెర్షన్‌ 2022 మార్చిలో రిలీజ్‌ చేయనుంది. ఆ తర్వాత 2022 జూన్‌లో ఫుల్‌ వెర్షన్‌ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.

ఈ గేమ్‌లో పలు స్థాయిల్లో విజేతలుగా నిలిచిన వారికి క్లింగ్‌ టోకెన్లను జారీ చేస్తారు. ఈ టోకెన్లను మనీ మార్చుకునేందుకు వీలుగా పాన్‌కేక్‌ స్వాపింగ్‌ డీ సెంట్రలైజ్డ్‌ ఎక్సేంజీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థకు హాంగ్‌కాంగ్‌, కజకిస్తాన్‌, గిఫ్ట్‌ సిటీ (గుజరాత్‌)లలో కూడా ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఉంది.

ఇండియాలో ఎంతో ఫేమస్‌ పబ్‌జీ. ఈ గేమ్‌లో చికెన్‌ డిన్నర్‌ వంటి గిఫ్ట్‌లు, ఒకేసారి టీమ్‌లుగా అడుతూ ఛాలెంజ్‌లు బెట్టింగ్‌లు చేసుకునే వీలుంది. ఆన్‌లైన్‌లో ఒకేసారి చాలా మంది ప్లేయర్లు కూడా ఆడొచ్చు. ఇక హైదరాబాద్‌ బేస్డ్‌ కంపెనీ తీసొకొచ్చే గేమ్‌లో మెటావర్స్‌ టెక్నాలజీని పొందు పరిచారు. దీంతో వర్చువల్‌ రియాల్టీలో ఒకే సారి ఎక్కువ మంది ఈ గేమ్‌ ఆడే వీలుంటుంది. అంతేకాదు చాలా కఠినంగా ఉండేలా గేమ్‌ని రూపొందించారు. ఈ గేమ్‌లో పై స్థాయిలకు వెళితే క్లింగ్‌ టోకెన్లు పొందవచ్చు.
 

మరిన్ని వార్తలు