ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.3,200 కోట్లు

27 Oct, 2023 06:33 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వా హనాల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ తాజా గా రూ.3,200 కోట్ల నిధులను అందుకుంది. టెమసెక్‌ నేతృత్వంలోని ఇన్వెస్టర్లు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వ్యాపార విస్తరణకు, అలాగే తమిళనాడులోని కృష్ణగిరి వద్ద లిథియం అయాన్‌ సెల్‌ తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఈ నిధులను వెచి్చంచనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది.

ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లతోపాటు ఎలక్ట్రిక్‌ కార్లను ప్రవేశపెట్టడం.. అలాగే గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయాలని ఓలా ఎలక్ట్రిక్‌ లక్ష్యంగా చేసుకుంది. ‘ఆటోమొబైల్స్‌ రంగంలో ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ యుగానికి ముగింపు పలకడమే మా లక్ష్యం. అంతర్జాతీయంగా ఈవీ హబ్‌గా మారే దిశగా భారత ప్రయాణంలో కంపెనీ నెలకొల్పుతున్న గిగాఫ్యాక్టరీ పెద్ద ముందడుగు. ఈవీలు, సెల్‌ విభాగంలో ప్రధాన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. స్థిర
మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లడానికి తయారీని పరుగులు పెట్టిస్తున్నాం’ అని ఓలా ఎలక్ట్రిక్‌ ఫౌండర్, సీఈవో భవీశ్‌
అగర్వాల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు