బ్యాంకుల ఎస్‌ఎఫ్‌టీ నివేదికల్లో వైరుధ్యాలు

1 Jul, 2023 04:46 IST|Sakshi

ఆదాయపన్ను శాఖ గుర్తింపు

న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి కొన్ని బ్యాంకులు సమరి్పంచిన ‘స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ స్పెసిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌ (ఎస్‌ఎఫ్‌టీ)’ విషయంలో వైరుధ్యాలు ఉన్నట్టు ఆదాయన్ను శాఖ గుర్తించింది. ఆదాయపన్ను శాఖ నిర్ధేశించిన లావాదేవీల వివరాలను ఎస్‌ఎఫ్‌టీ కింద ఏటా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్, వివిధ సంస్థలు ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది.

గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్‌ఎఫ్‌టీని మే 31 నాటికి దాఖలు చేయాలి. ఫారెక్స్‌ డీలర్లు, బ్యాంక్‌లు, సబ్‌ రిజి్రస్టార్, ఎన్‌బీఎఫ్‌సీ, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్‌ ట్రస్టీలు, షేర్ల బైబ్యాక్‌ చేసిన కంపెనీలు, డివిడెండ్‌ చెల్లించిన కంపెనీలు ఎస్‌ఎఫ్‌టీ పరిధిలోకి వస్తాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ బ్యాంక్‌ నివేదించిన ఎఫ్‌ఎఫ్‌టీలో వ్యత్యాసాలను గుర్తించినట్టు ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగం సీబీడీటీ ప్రకటించింది.

కొన్ని లావాదేవీలను అసలుకే వెల్లడించకపోగా, కొన్ని లావాదేవీల సమాచారం కచి్చతంగా పేర్కొనలేదని వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లో రెండు కోపరేటివ్‌ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించగా, వేలాది కోట్ల రూపాయల లావాదేవీలను రిపోర్ట్‌ చేయాలేదని బయటపడినట్టు తెలిపింది. వివిధ సంస్థలు ఎస్‌ఎఫ్‌టీ ద్వారా ఆదాయపన్ను శాఖకు వివరాలు తెలియజేస్తే.. ఆయా సమాచారాన్ని పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లో చేరుస్తారు. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ ఏఐఎస్‌ను పరిశీలించుకుని రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్‌ఎఫ్‌టీల్లో వ్యత్యాసాలు గుర్తించినట్టు ప్రకటించిన సీబీడీటీ, తీసుకున్న చర్యలపై సమాచారం తెలియజేయలేదు. 

>
మరిన్ని వార్తలు