బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు.. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తుందా?

9 Dec, 2023 13:09 IST|Sakshi

బ్యాంకు ఉద్యోగుల ఐదురోజుల పనిదినాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పనిదినాల్ని తగ్గించి బ్యాంకు ఉద్యోగుల రోజూవారి పనిగంటలు పెంచమని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

త్వరలో బ్యాంకులు వారానికి ఐదు రోజులు పనిచేయనున్నాయా? ఇదే అంశంపై తాజా పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ స్పందించారు. ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పనిదినాల్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అయితే దీనిని కేంద్రం అంగీకరిస్తుందా? లేదా? అని అంశంపై స్పందించలేదు.

ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి రెండవ శనివారం, నాలుగవ శనివారం రోజు మాత్రమే సెలవు దినాలు. ఒకవేళ కేంద్రం ఐబీఏ ప్రతిపాదనల్ని అంగీకరిస్తే ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కాగా.. రోజూవారి పనిగంటలు పెరిగే అవకాశం ఉందంటూ బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు