Uday Kotak: ‘బ్యాంకులకు వచ్చే బిజినెస్‌ మొత్తం వారి చేతుల్లోకి..!’

5 Dec, 2021 19:24 IST|Sakshi

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు భారీ ఎత్తున ఊపందుకున్నాయి. గత ఏడాది కాలంగా కార్డు పేమెంట్స్‌తో పోల్చుకుంటే డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోదీ కూడా వెల్లడించారు. ఇప్పుడు ఆయా డిజిటల్‌ చెల్లింపుల యాప్స్‌ టెక్నాలజీను అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు  వెనకబడి ఉన్నాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ వెల్లడించారు. 

చిన్న చూపు తగదు..!
గత రెండేళ్లుగా భారతీయ బ్యాంకర్లు డిజిటల్‌ చెల్లింపుల వ్యాపారాలను చిన్న చూపు చూసున్నాయని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) బ్లూమ్‌బెర్గ్ నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరమ్‌లో ఉదయ్‌ కోటక్ అన్నారు. 85 శాతం మార్కెట్ వాటాను పొందిన గూగుల్ పే, ఫోన్‌పే యాప్స్‌ ద్వారా యూపీఐ సేవలను ఆయా బ్యాంకులు అనుమతించినట్లు పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో సాంప్రదాయ మార్కెట్ల నుంచి పెద్దభాగంలో కస్టమర్లు బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో విఫలమైతే బ్యాంకులకు ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఫోన్‌పై,గూగుల్‌ పే అనుసరిస్తోన్న సాంకేతికతను వీలైనంత త్వరగా అందిపుచ్చుకుంటే మంచిందని, అందుకు కావాల్సిన వారిపై నియమాకాలను బ్యాంకులు చేపట్టాలని ఆయన అన్నారు.  

బ్యాంకు ఖాతాలను ఇచ్చేస్తాయి
డిజిటల్‌ చెల్లింపుల యాప్స్‌ దూకుడు మీద ఉన్నాయి. దేశవ్యాప్తంగా గణనీయమైన డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్నాయి. పేటీఎం లాంటి డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు పేరుతో సేవలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం గూగుల్‌ పే యూజర్లకు ఖాతాలను అందించే విషయంతో వెనకడుగు వేసింది. రానున్న రోజుల్లో ఆయా డిజిటల్‌ చెల్లింపుల యాప్స్‌ యూజర్లకు ఖాతాలను అందించే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
చదవండి: రూ. 999కే ఆరోగ్య బీమా..! లాంచ్‌ చేసిన ఫోన్‌పే..! వివరాలు ఇవే..!

మరిన్ని వార్తలు