BSA Motorcycles: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 650కు పోటీగా..! భారతలోకి బీఎస్‌ఏ గోల్డ్‌స్టార్‌ 650..!

5 Dec, 2021 18:29 IST|Sakshi

బీఎస్‌ఏ సైకిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. హీరో సైకిల్స్‌ తరువాత బీఎస్‌ఏ సైకిల్స్‌ భారత మార్కెట్లలో అత్యంత ఆదరణను పొందాయి. సైకిళ్లతో పాటుగా బైక్లను కూడా బీఎస్‌ఏ తయారుచేసేది. 1970లో బీఎస్‌ఏ తన ఉత్పత్తులను నిలిపివేయగా..2016లో మహీంద్రా గ్రూప్స్‌ బీఎస్‌ఏ మోటర్స్‌ను దక్కించుకుంది. రెట్రో బైక్‌ లవర్స్‌ కోసం ఇప్పుడు సరికొత్త బైక్‌తో బీఎస్‌ఏ మోటార్స్‌ ముందుకు రానుంది. 

బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650
బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్‌ఏ) అధికారికంగా క్లాసిక్ లెజెండ్స్ భాగస్వామ్యంతో తమ మొదటి కొత్త జెన్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. కొత్త బీఎస్‌ఏ మోటార్‌సైకిల్‌ను యూకే  బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచారు. బీఎస్‌ఏ గోల్డ్‌ స్టార్‌ 650 మోటార్స్‌కు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.ఈ బైక్‌కు సంబంధించిన వీడియోను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ 650కు పోటీగా..
బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650  గోల్డ్ స్టార్ 650 సీసీ సింగిల్ సిలిండ‌ర్ ఇంజ‌న్‌ను క‌లిగిఉంటుంది. ఈ బైక్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ఇంట‌ర్‌సెప్ట‌ర్ 650, కాంటినెంట‌ల్ జీటీ 650కు పోటీ ఇవ్వనుంది.  2022 బీఎస్ఏ గోల్డ్ స్టార్ ఒరిజిన‌ల్ గోల్డ్ స్టార్ బైక్‌ను పోలి ఉంది. రౌండ్‌ హెడ్‌ల్యాంప్‌, టియ‌ర్‌డ్రాప్ షేప్‌తో ఫ్యూయ‌ల్ ట్యాంక్‌, లార్జ్ ఎయిర్‌బాక్స్‌, ఎగ్జాస్ట్ పైప్‌, రియ‌ర్‌వ్యూ మిర్ర‌ర్స్ వంటి ఫీచ‌ర్ల‌తో కస్టమర్లకు ఇట్టే కట్టిపడేస్తుంది. 


 


చదవండి: టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు