భారత్‌ బ్యాంకింగ్‌ పటిష్టమవుతోంది: ఫిచ్‌

17 Aug, 2023 04:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భారతీయ బ్యాంకుల నిర్వహణా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ– ఫిచ్‌ తన తాజా ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్‌కు సంబంధించి పలు సూచీలు కోవిడ్‌ ముందుస్తు పరిస్థితులకన్నాసైతం ముందంజలో ఉన్నట్లు వివరించింది.

కొన్ని రంగాల విషయంలో బ్యాంకుల రుణ బకాయిలూ తగ్గుతున్నట్లు తెలిపింది. ‘ఆరి్థక వ్యవస్థ భారీ పరిమాణం, డిమాండ్‌ పరిస్థితులు లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి అలాగే ఆదాయాలు పెరగడానికి, ఇబ్బందులను తగ్గించడానికి బ్యాంకింగ్‌కు మరిన్ని అవకాశాలను అందించాల్సి ఉంది’’ కూడా  ఫిచ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు