బిల్, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్‌

4 Jun, 2021 02:51 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త కల్పన కొచర్‌ తాజాగా బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌లో డైరెక్టరుగా (డెవలప్‌మెంట్‌ పాలసీ అండ్‌ ఫైనాన్స్‌ విభాగం) చేరనున్నారు. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో మానవ వనరుల విభాగం హెడ్‌గా ఉన్నారు. ఐఎంఎఫ్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించిన కొచర్‌ ఈ ఏడాది జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌లో చేరతారు. గడిచిన 33 ఏళ్లుగా సంస్థ పట్ల ఆమె అంకితభావంతో పనిచేశారని, అంతర్జాతీయ ద్రవ్య నిధి లక్ష్యాల సాధనకు ఎంతో కృషి చేశారని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా ప్రశంసించారు. 1988లో ఆర్థికవేత్తగా ఐఎంఎఫ్‌లో కొచర్‌ కెరియర్‌ ప్రారంభించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు