భారత్‌ ఆ ట్రెండ్‌ని మార్చింది.. ఆగస్ట్‌లో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు!

23 Sep, 2022 08:29 IST|Sakshi

న్యూఢిల్లీ: గత నెల(ఆగస్ట్‌)లో వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) ఫండ్స్‌ నుంచి దేశీ స్టార్టప్‌లకకు 99.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 8,000 కోట్లు) పెట్టుబడులు లభించాయి. డేటా ఎనలిటిక్స్‌ సంస్థ గ్లోబల్‌ డేటా వివరాల ప్రకారం 128 స్టార్టప్‌లు నిధులను సమీకరించాయి. జులైతో పోలిస్తే ఆగస్ట్‌లో పెట్టుబడులు 9.7 శాతం ఎగశాయి. ఆగస్ట్‌లో వీసీ పెట్టుబడులు బిలియన్‌ డాలర్లను చేరనప్పటికీ క్షీణతకు అడ్డుకట్ట పడినట్లు గ్లోబల్‌ డేటా ప్రధాన నిపుణులు ఔరోజ్యో తి బోస్‌ పేర్కొన్నారు.

లావాదేవీల పరిమాణం 2.3 శాతం తగ్గినప్పటికీ నిధుల సమీకరణలో వృద్ధి నమోదైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఇదే కాలంలో యూఎస్, యూకే తదితర గ్లోబల్‌ మార్కెట్లలో నిధుల సమీకరణ వెనకడుగులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ట్రెండ్‌ను ఇండియా, చైనా మాత్రమే అధిగమించినట్లు పేర్కొన్నారు. 2022 జనవరి–ఆగస్ట్‌ కాలంలో 1,239 వీసీ పెట్టుబడుల డీల్స్‌ నమోదైనట్లు ప్రస్తావించారు.

చదవండి: ఆ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు!

మరిన్ని వార్తలు