ఇన్ఫీ నుంచి ప్రైవేట్‌ ‘5జీ సర్వీసులు’

28 Feb, 2023 00:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తాజాగా తమ క్లయింట్ల కోసం ప్రైవేట్‌ 5జీ–యాజ్‌–ఎ–సర్వీస్‌ను ప్రారంభించింది. దీనితో కంపెనీలకు అధిక బ్యాండ్‌విడ్త్, తక్కువ లేటెన్సీ, విశ్వసనీయ వైర్‌లెస్‌ కనెక్టివిటీ లభించగలదని సంస్థ తెలిపింది.

డేటా ప్రాసెసింగ్‌కు పట్టే వ్యవధిని కుదించడం ద్వారా నెట్‌వర్క్‌లో జాప్యాన్ని తగ్గించగలిగే మల్టీ–యాక్సెస్‌ ఎడ్జ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతను ఇందులో వినియోగిస్తున్నట్లు ఇన్ఫీ తెలిపింది.

మరిన్ని వార్తలు