ప్రతి రోజు రూ.200 పొదుపు చేస్తే రూ.28 లక్షలు మీ సొంతం

2 Sep, 2021 15:39 IST|Sakshi

సురక్షితమైన రాబడిని అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న పెట్టుబడిదారులకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అనేక కొత్త పాలసీలను తీసుకువస్తుంది. అందులో జీవన్ ప్రగతి పాలసీ ఒకటి. పెట్టుబడిదారులు తమ రిటైర్ మెంట్ లేదా వృద్ధాప్యం కొరకు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది ఉతమమైన పాలసీ. ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో పెట్టుబడిదారులు ప్రతి నెలా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందించడంతో పాటు పెట్టుబడిదారులకు డెత్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 

ఈ పాలసీని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఎఐ) ఆమోదించింది. సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పాలసీలో మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు పొందాలంటే పెట్టుబడిదారులు ప్రతి నెలా సుమారు రూ.6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు రోజుకు కనీసం రూ.200 ఆదా చేయాల్సి ఉంటుంది. ఒకవేల పెట్టుబడిదారుడు మరణించినట్లయితే ఆ మొత్తంను నామినీ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. పాలసీ తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల్లోపు పెట్టుబడిదారుడు మరణించినట్లయితే నామినీ ప్రాథమిక మొత్తంలో 100% బీమా పొందుతారు.(చదవండి: థర్మామీటర్‌ గడియారాలొస్తున్నాయ్‌!)

రిస్క్ కవర్
ఈ పాలసీలో రిస్క్ కవర్ ప్రతి ఐదేళ్లకోసారి పెరుగుతుంది. మొదటి ఐదేళ్ల పెట్టుబడికి రిస్క్ కవర్ అదే ఉంటుంది. 6 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు ఇన్సూరెన్స్ రిస్క్ కవర్ 25 శాతం నుంచి 125 శాతానికి, 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు రిస్క్ కవర్ 150 శాతానికి, మీరు 20 ఏళ్ల వరకూ చెల్లిస్తూ మధ్యలో మనీ తీసుకోకపోతే మీకు రిస్క్ కవర్ 200 శాతానికి పెరుగుతుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే.. మొదటి ఐదేళ్ల వరకూ బీమా కవరేజీ అంతే ఉంటుంది. ఆ తర్వాత 6-10 మధ్య అది రూ.17.5 లక్షలు ఉంటుంది. అలాగే 11-15 ఏళ్ల మధ్య అది రూ.21 లక్షలు ఉంటుంది. 16-20 ఏళ్ల మధ్య బీమా కవరేజీ రూ.28 లక్షలు ఉంటుంది.(చదవండి: రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ!)

గరిష్ట వయోపరిమితి
ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టాలంటే గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు వరకు ఉంది. ఈ పాలసీ కింద గరిష్ట ప్రయోజనాలను పొందడానికి పెట్టుబడిదారులు కనీసం 12 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మంచిది. ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో పెట్టుబడిదారులు గరిష్టంగా 20 ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు 20 ఏళ్ల తర్వాత రూ.28 లక్షలు పొందాలంటే రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే మంచిది. ఈ పాలసీ కింద ప్రతి రోజు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు