సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా నియామకం!

27 Jun, 2022 12:51 IST|Sakshi

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్‌గా ఐఆర్‌ఎస్‌ నితిన్‌ గుప్తా నియమితులయ్యారు. కేంద్ర యూనియన్‌ కేబినెట్‌ నితిన్‌ గుప్తాను నియమిస్తూ ఖరారు చేసింది. 

కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయించిన తేదీ నుంచి గుప్తా సీబీడీటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర రెవెన్యూ శాఖ నియామకాల కమిటీ సెక్రటేరియట్ విడుదల చేసిన  ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. కాగా, ప్రస్తుతం గుప్తా సీబీడీటీ విభాగంలో ఇన్వెస్టిగేషన్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు