ఐ థింక్‌ లాజిస్టిక్స్‌

9 Sep, 2022 06:33 IST|Sakshi

ఇంటర్నేషనల్‌ లాజిస్టిక్స్‌ సేవలు

హైదరాబాద్‌: సాస్‌ ఆధారిత షిప్పింగ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ ‘ఐ థింక్‌ లాజిస్టిక్స్‌’.. దేశీ ఈ కామర్స్‌ విక్రేతల కోసం అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల దేశీ ఈ కామర్స్‌ విక్రేతలు (ఎంఎస్‌ఎంఈలు), డీ2సీ బ్రాండ్లు అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించొచ్చని సంస్థ తెలిపింది. ఐథింక్‌ లాజిస్టిక్స్‌ ఇంటర్నేషనల్‌ భాగస్వామ్య సంస్థల ద్వారా ఇందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది.

భారత్‌ నుంచి సీమాంతర షిప్పింగ్‌ సేవల విలువ 2025 నాటికి 129 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారిత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఐథింక్‌ లాజిస్టిక్స్‌ భారత ఈ కామర్స్‌ విక్రేతల వృద్ధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఒక్క క్లిక్‌తో ఐథింక్‌ లాజిస్టిక్స్‌ ప్లాట్‌ఫామ్‌.. అమెజాన్, ఈబే, షాపిఫై, మెజెంటో, వూకామర్స్‌ సంస్థలతో అనుసంధానించనున్నట్టు తెలిపింది.     
 

మరిన్ని వార్తలు