ఇంత మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ వస్తుందా.. జీప్ కంపెనీ భారీ డిస్కౌంట్స్

9 Apr, 2023 20:59 IST|Sakshi

అమెరికన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ 'జీప్' (Jeep) భారతీయ మార్కెట్లో కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి నాలుగు SUVలను విక్రయిస్తోంది. అయితే కంపెనీ ఈ నెలలో తన కంపాస్, మెరిడియన్ బేస్ వేరియంట్‌ల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జీప్ మెరిడియన్ బేస్ మోడల్ లిమిటెడ్ MT ధర రూ. 2.35 లక్షలు తగ్గింది. ధరల తగ్గుదల తర్వాత దీని ధర రూ. 27.75 లక్షలు. ఇందులో లిమిటెడ్ AT మోడల్ ధర రూ. 32 లక్షలు. ఈ ధరలలో ఎటువంటి మార్పు లేదు. అదే సమయంలో లిమిటెడ్ (O) ట్రిమ్ ధర రూ. 35వేలు వరకు పెరిగింది. ఈ మోడల్ కొత్త ధర రూ. 32.95 లక్షలు.

ఇక కంపాస్ స్పోర్ట్ ఎటి పెట్రోల్ మోడల్ ధర ఇప్పుడు రూ. 20.99 లక్షలు. ఈ ఎస్‌యువి ధరలను కంపెనీ రూ. 1.08 లక్షలు తగ్గించింది. ధరల తగ్గుదలకు ముందు దీని ధర రూ. 22.07 లక్షలు. అదే సమయంలో లిమిటెడ్ ఏటి, మోడల్ ఎస్ ఏటి ధరలలో ఎటువంటి మార్పులు లేదు.

(ఇదీ చదవండి: కృతి ఖర్బందా కొత్త కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు!)

జీప్ కంపాస్ డీజిల్ ధరల విషయానికి వస్తే.. అన్ని మోడల్స్ ధరలు రూ. 35,000 తగ్గాయి. ఇందులో లిమిటెడ్, మోడల్ ఎస్ సిరీస్‌, 4X4 మోడల్‌ మొదలైనవి ఉన్నాయి. కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం వల్ల ఈ మోడల్స్ ధరలు తగ్గి ఉండవచ్చని భావిస్తున్నారు.

కంపాస్ రెండూ డీజిల్ ఇంజన్స్ పొందుతుంది, అవి1.4-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ & 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్. అదే సమయంలో మెరిడియన్ ఒకే సింగిల్ డీజిల్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. అయితే పనితీరు పరంగా రెండూ అద్భుతంగా ఉంటాయి.

>
మరిన్ని వార్తలు