యూజర్ల మతిపోగొడుతున్న జీప్ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు..!

2 Mar, 2022 17:56 IST|Sakshi

ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ జీప్ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు చిత్రాలను బయటకు విడుదల చేసింది. జీప్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారులు ఉన్నప్పటికీ సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు మాత్రం ఇదే. ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2023లో విడుదల కానుంది. జీప్ మాతృ సంస్థ స్టెల్లంటిస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే రెండు సంవత్సరాలలో 21 వాహనాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

అందుకోసం 2025 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాలపై సుమారు $ 35.5 బిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2025 నాటికి మొత్తం ప్రపంచ అమ్మకాలలో 70% ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకురావాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఈ వాహనం గురించి మాట్లాడుకుంటే ఆఫ్-రోడింగ్ సామర్ధ్యం, రిమోట్ వాహన ట్రాకింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ వంటి అనేక ఫీచర్లతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ జీప్'లో కొన్ని చంకీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, నాజూకైన ఎల్ఈడీ డీఆర్ఎల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, ఫ్లాష్ ఫైవ్ స్పోక్ డ్డ్యూయల్ టోన్ అలాయ్, సీ-పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్, ఎక్స్ ఆకారంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు ఉన్నాయి.

జీప్ ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ మాస్క్యుల‌ర్ లుక్‌తో రెనెగేడ్ త‌ర‌హా డిజైన్‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంది. రియ‌ర్ సైడ్ త్రీడీ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. 2022లో జీప్ భార‌త్‌లో కంపాస్ ట్ర‌య‌ల్‌హాక్‌ను లాంఛ్ చేస్తుండ‌గా న్యూ జ‌న‌రేష‌న్ గ్రాండ్ చెరోకీ, త్రీ రో మెరిడియ‌న్ ఎస్‌యూవీలతో ఎంట్రీ ఇవ్వ‌నుంది.

(చదవండి: వాట్ ఆన్ ఐడియా స‌ర్‌జీ.. ఇలా చేస్తే సైక్లింగ్ బూమ్ రావచ్చు: ఆనంద్ మ‌హీంద్రా)

మరిన్ని వార్తలు