ఏపీ,తెలంగాణాలో మరో 8 డేనగరాలకు జియో ట్రూ5జీ సేవలు

24 Jan, 2023 19:26 IST|Sakshi

సాక్షి,ముంబై: టెలికాం మేజర్‌ రిలయన్స్‌ జియో  తన 5G కవరేజీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మరో 8 నగరాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, నరసరావు పేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరంతోపాటు, తెలంగాణలోని నల్గొండతో కలిపి  తెలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది నగరాలు మంగళవారం నుండి Jio True 5G సేవలను పొందనున్నాయి.  దీంతో ఏపీలోని 16, తెలంగాణాలో 6 నగరాల్లో  జియో ట్రూ5జీని వినియోగ దారులకు అందిస్తోంది. 

రిలయన్స్ జియో ఈ నగరాల్లో చాలా వరకు 5జీ సేవలను ప్రారంభించిన తొలి ఏకైక ఆపరేటర్‌గా అవతరించిందని కంపెనీ ఒక ప్రకటనలె తెలిపింది.  ఈ నగరాల్లోని జియో వినియోగదారులు ఈరోజు నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను పొందేందుకు Jio వెల్‌కమ్ ఆఫర్‌ను పొందనున్నారు. ఏపీ, తెలంగాణాలోని మరికొన్ని నగరాలకు జియో ట్రూ5 జీ సేవల విస్తరణపై జియో సంతోషం వెలిబుచ్చింది.  దేశం మొత్తం డిసెంబర్ 2023 నాటికి 5G సేవల్ని అందించాలన్నలక్క్ష్యంలో భాగంగా మొత్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాల్లో జియో ట్రూ 5జీ ప్రారంభించినట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.

ఇప్పటికే ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలులోను, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలో  జియో ట్రూ5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

మరిన్ని వార్తలు