కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌! సెప్టెంబర్ 21 నుంచే..

16 Sep, 2023 16:36 IST|Sakshi

ప్రముఖ ప్రైవేట్‌ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) తమ కస్టమర్లకు షాకిచ్చింది. బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ప్రకటించింది. మార్పులు సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయి.

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ప్రస్తుతం ఉన్న బేస్ రేటును 11.20 శాతం నుంచి 11.40 శాతానికి పెంచింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR )ను 16.20 శాతం నుంచి 16.40 శాతానికి పెంచింది. దీంతో రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరిం‍త పెరగనుంది. అలాగే ఈఎంఐలపైనా దీని ప్రభావం పడనుంది.

ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లు
ఇక కరూర్ వైశ్యా బ్యాంక్ జూలైలో KVB ESOS 2011 స్కీమ్, KVB ESOS 2018 పథకం కింద ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లను స్టాక్ ఆప్షన్‌గా కేటాయించినట్లు ప్రకటించింది. ఒక్కొక్క ఈక్విటీ షేర్ల ముఖ విలువ రూ.2 ఉంటుంది. కాగా శుక్రవారం (సెప్టెంబర్‌15) వారాంతంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు 1.84 శాతం లాభంతో రూ.132.75 వద్ద ముగిశాయి.

(Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్‌ చేయండి.. ఆస్వాదించండి..)

మరిన్ని వార్తలు