మాటలు జాగ్రత్త.. ఎవ్వరి మనసు గాయపడకూడదు

16 Sep, 2023 16:37 IST|Sakshi

చెన్నై: ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కే కానీ అది ద్వేషపూరితంగా ఉండకూడదని తెలిపింది. 

బాధ్యతలను తెలియజేసేది.. 
స్థానిక ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు సనాతన ధర్మంపై వ్యతిరేకత గురించి డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఎలాంగోవన్ వేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ శేషసాయి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది మన దేశం, మన పరిపాలకులు, తల్లిదండ్రులు, గురువుల పట్ల మన శాశ్వత బాధ్యతను గుర్తుచేసే ధర్మాల సమూహమని పేదల పట్ల దయ చూపించమని చెబుతుందని అన్నారు. 

సనాతన ధర్మంపై డిబేట్‌లా..
ఈ సందర్బంగా ఆయన సనాతన ధర్మంపై డిబేట్లు పెట్టడంపై మరింత తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మం కులవ్యవస్థను ప్రోత్సహించి అంటరానితనాన్ని ప్రేరేపిస్తుందన్న అసత్యాన్ని ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నం చేయడాన్ని ఆయన  ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని ఎప్పుడో నిర్మూలించడం జరిగిందని గుర్తుచేశారు. 

మనుషులంతా ఒక్కటే.. 
ఈ దేశంలో అందరూ ఒక్కటేనని ఇటువంటి దేశంలో అంటరానితనాన్ని సహించేది లేదని అన్నారు. మతం అనేది సహజమైన కల్మషంలేని స్వచమైన విశ్వాసం అనే పునాది మీద నిర్మితమైందని భావ ప్రకటన స్వేచ్ఛ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండకూడదని అన్నారు.   

ఇది కూడా చదవండి: ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ      

మరిన్ని వార్తలు