రిలయన్స్‌ రిటైల్‌లో పెట్టుబడులు

25 Sep, 2023 06:39 IST|Sakshi

కేకేఆర్‌ వాటా పెంపు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ దాదాపు రూ. 2,070 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఇందుకుగాను కేకేఆర్‌కు 1,71,58,752 ఈక్విటీ షేర్లను జారీ చేసినట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెల్లడించింది. దీంతో రిలయన్స్‌ రిటైల్‌లో కేకేఆర్‌ వాటా 1.17 శాతం నుంచి 1.42 శాతానికి బలపడింది. ఈ నెల మొదట్లో అనుబంధ రిటైల్‌ సంస్థలో కేకేఆర్‌ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) పేర్కొన్న సంగతి తెలిసిందే.

1976లో ఏర్పాటైన కేకేఆర్‌ 2023 జూన్‌కల్లా 519 బిలియన్‌ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉంది. కాగా.. ఈ నెల మొదట్లోనే ఆర్‌ఐఎల్‌ ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ(క్యూఐఏ) నుంచి రూ. 8,278 కోట్ల పెట్టుబడులను అందుకుంది. తద్వారా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో 1 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక 2020లో వివిధ గ్లోబల్‌ పీఈ సంస్థలకు 10.09 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 47,265 కోట్లను సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ విషయం!

మరిన్ని వార్తలు