ఐపీవోకి స్విగ్గీ.. ఎప్పుడంటే?

8 Nov, 2023 17:07 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)కు  సిద్ధమైంది. వచ్చే ఏడాది ఐపీవోని లాంచ్‌ చేయనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే నిపుణుల సలహాలు తీసుకుంది. తాజాగా, ఐపీవోకు ఆర్ధికపరమైన సలహాలు ఇచ్చేందుకు  స్విగ్గీ  ఏడు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.  

ఆ ఏడింటిలో కొటక్‌ మహీంద్రా కేపిటల్‌, సిటీ అండ్‌ జేపీ మోర్గాన్‌లో పనిచేస్తున్న సీనియర్ సిబ్బంది ఉన్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

అంతేకాదు ఇప్పటికే సంస్థకు సంబంధిన రాతపూర్వక డాక్యుమెంట్లను DRHP (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్) స్విగ్గీ పూర్తి చేసిందని, అన్నీ సవ్యంగా జరిగి మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది మార్చి నెలలో ఐపీవోకి వెళ్లనున్నట్లు నివేదికలు హైలెట్‌ చేశాయి. 

700 మిలియన్ల ఫండ్‌ 
గత ఏడాది జనవరిలో స్విగ్గీ కంపెనీ విలువ 10.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఆ సమయంలో సంస్థ వృద్ది కోసం నిధుల సమీకరించింది. రెండు బ్యాక్-టు-బ్యాక్ మార్కెట్‌ డౌన్ల తర్వాత అట్లాంటాకు చెందిన అసెట్‌ మేనేజ్మెంట్‌ కంపెనీ ఇన్వెస్కో స్విగ్గిలో చివరి సారిగా 2023 ఏప్రిల్‌ ముగిసే సమయానికి దాదాపు 5.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇన్వెస్కోతో పాటు బారన్ క్యాపిటల్ 7.3 బిలియన్లు ఇన్వెస్ట్‌ చేయగా ఆల్ఫా వేవ్ గ్లోబల్, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ అండ్‌ ప్రోసస్‌లు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి.  
 

మరిన్ని వార్తలు