అదిరిపోయే ఫీచర్స్ గల 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఇంత తక్కువ ధరకా!

9 Nov, 2021 17:22 IST|Sakshi

భారతీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీసంస్థ లావా ఇంటర్నేషనల్ తన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ లావా అగ్ని 5జీని నేడు దేశంలో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో క్వాడ్ రియర్ కెమెరాలు, 30 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంది. లావా అగ్ని 5జీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ గల 90హెర్ట్జ్ డిస్ ప్లేతో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 8జీబీ ర్యామ్, 10 ప్రీలోడెడ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ రియల్ మీ 8ఎస్ 5జీ, మోటో జీ 5జీ, శామ్ సంగ్ గెలాక్సీ ఎమ్32 5జీ వంటి వాటితో పోటీపడనుంది.

లావా అగ్ని 5జీ ధర:

లావా అగ్ని 5జీ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. నవంబర్ 18 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ రిటైలర్ల ద్వారా దేశంలో అమ్మకానికి వస్తుంది. నేటి నుంచి అమెజాన్, లావా ఇ-స్టోర్ ద్వారా ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. లావా అగ్ని 5జీని ముందస్తుగా బుకింగ్ చేసుకునే కస్టమర్లు ప్రాథమిక మొత్తం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వీరికి ఫోన్ మీద రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.

లావా అగ్ని 5జీ ఫీచర్స్:

  • డిస్‌ప్లే: 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
  • ప్రాసెసర్‌: మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్
  • ర్యామ్‌, స్టోరేజ్‌: 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
  • బ్యాక్‌ కెమెరా: 64 ఎంపీ, 5 ఎంపీ, 2 ఎంపీ, 2 ఎంపీ 
  • ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ
  • బ్యాటరీ: 5,000 ఎమ్ఎహెచ్
  • 5జీ: డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్
  • కనెక్టివిటీ: 5జీ, 4జీ ఓఎల్టిఈ,  వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ఎ-జీపీఎస్, యుఎస్ బి టైప్-సి పోర్ట్
  • సెన్సార్లు : ‎యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆంబియంట్ లైట్ సెన్సార్, ప్రోమిసిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ 

(చదవండి: చాపకింద నీరులా.. రోడ్లపై రయ్‌ రయ్‌ మంటూ ఎలక్ట్రిక్‌ ట్రక్‌లు)

మరిన్ని వార్తలు