కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్!

12 Sep, 2021 20:58 IST|Sakshi

మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉందా? అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉన్న వినియోగదారులకు తక్కువ వడ్డీరేటుతో గృహ రుణాలు అందిస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్తగా గృహ రుణాలు తీసుకోవాలనే వారి కోసం వడ్డీ రేటును 6.90 శాతానికి తగ్గించింది. గృహ రుణాలపై ఇప్పటివరకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. మీ సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది.(చదవండి: మీ క్రెడిట్ స్కోరు వేగంగా ఎలా పెంచుకోవాలి..?)

రుణ పరిమితి ఎంత?
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకారం.. సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు రూ.50 లక్షల రుణంపై వడ్డీ రేటు 6.90 శాతంతో ప్రారంభమవుతుంది. 700 కంటే ఎక్కువ స్కోరు ఉన్న వినియోగదారులకు రూ.80 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే 7 శాతం వడ్డీ రేటు పడనుంది. మీ సిబిల్ స్కోరు అనేది ఒక వ్యక్తి ఇంతకు ముందు రుణం తీసుకున్నాడా? ఒకవేళ రుణం తీసుకున్నట్లయితే సకాలంలో చెల్లించాడా అనే దానిపై స్కోరు ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్లను రుణదాతలు చెక్ చేసేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు