LIC: ఎల్‌ఐసీ పాలసీ దారులకు అలెర్ట్‌ ,ఇకపై ఈ రెండు ప్లాన్లు అందుబాటులో ఉండవు

23 Nov, 2022 18:19 IST|Sakshi

ప్రముఖ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ ఇండియా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) జీవర్‌ అమర్‌, టెక్‌ టర్మ్‌ పాలసీలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 23 నుంచి ఆ రెండు పాలసీలు వినియోగంలో ఉండవని ఎల్‌ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

ఎల్‌ఐసీ 2019 ఆగస్ట్‌లో జీవన్‌ అమర్‌ ప్లాన్‌ను, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఎల్‌ఐసీ టెక్‌ టర్మ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.అయితే తాజాగా ఆ ప్లాన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎల్‌ఐసీ పేర్కొంది. అందుకు కారణం రీ ఇన్స్యూరెన్స్‌ ప్రీమియం ధరలు పెరగడమే కారణమని తెలుస్తోంది. కాగా, త్వరలో ఆ రెండు పాలసీలను మార్పులు చేసి మళ్లీ అందుబాటులోకి తెస్తామని సంస్థ చెబుతోంది. 

అర్హతలు
10 నుంచి 40 సంవత్సరాల కాలపరిమితితో పాలసీ దారుడు ఎల్‌ఐసీ జీవన్‌ అమర్‌ ప్లాన్‌ను కనీసం రూ.25 లక్షలు, ఎల్‌ఐసీ టెక్‌ టర్మ్‌ ప్లాన్‌ కనీసం రూ. 50 లక్షలు హామీ మొత్తంతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  ఈ రెండు ప్లాన్లలో పాలసీ కట్టే సమయంలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని నామినీకి అందుతుంది. 

ప్లాన్‌ తీసుకొని ఉంటే 
పాలసీదారులు ఇప్పటికే ఈ రెండు ప్లాన్‌లను కొనుగోలు చేస్తే.. ఆ పాలసీలు అలాగే కొనసాగుతాయని ఎల్‌ఐసీ ప్రతనిధులు తెలిపారు. కొత్తగా పాలసీ తీసుకునేవారికి మాత్రం అందుబాటులో ఉండవు.

మరిన్ని వార్తలు