హైదరాబాద్‌లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ టెక్‌ సెంటర్‌ 

12 May, 2023 18:51 IST|Sakshi

 తెలంగాణాలో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్నఎల్‌ఎస్‌ఈజీ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్‌ ఏర్పాటుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకు వచ్చింది.  లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌ పీఎల్‌సీఎక్సలెన్స్‌ సెంటర్‌ఏర్పాటుతో దాదాపు వెయ్యిమందికి ఉపాధి లభించనుంది.మంత్రి కేటీఆర్‌తో లండన్‌లోజరిగిన సమావేశం అనంతరం సంస్థ ప్రకటించింది.  (ప్యూర్‌ ఈవీ కొత్త ఈ-స్కూటర్‌: 150 కి.మీ రేంజ్‌, ధర ఎంతంటే?)

ఈ మేరకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ లండన్‌లో ఎల్‌ఎస్‌ఈజీ గ్రూప్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (CIO) ఆంథోనీ మెక్‌కార్తీతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ యూకే పర్యటనలో భాగంగా  తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌ఎస్‌ఈజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎంఓయూపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి  విష్ణువర్ధన్ రెడ్డి మెక్‌కార్తీ సంతకాలు చేశారు. ఇది ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగానికి ఊతమమ్వివనుందని అంచనా. 

లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డేటా ప్రొవైడర్‌గా సేవలందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో పని చేయడంతో పాటు 190 దేశాలలో వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

మరిన్ని వార్తలు