ఆస్ట్రేలియాలో ఇండియన్ బ్రాండ్ డీలర్షిప్ ఎలా ఉందో చూసారా.. (వీడియో)

11 Dec, 2023 21:10 IST|Sakshi

Mahindra Dealership In Austrelia: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్‌' కుమార్తె 'గ్రేస్ హేడెన్' ఇండియన్ బ్రాండ్ కారుని ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసింది. కారు డెలివరీకి సంబంధించిన వీడియోను 'మహీంద్రా ఆస్ట్రేలియా' తన యూట్యూబ్ ఛానల్లో అప్‌లోడ్ చేసింది. ఇందులో మహీంద్రా డీలర్షిప్ ఆస్ట్రేలియాలో ఎలా ఉందనేది స్పష్టంగా చూడవచ్చు.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా సంస్థ కార్లు, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. అక్కడ ఇండియన్ బ్రాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉన్న కారణంగానే ఈ ఎగుమతులు జరుగుతాయి.

ఇటీవల గ్రేస్ భారతదేశానికి వచ్చినప్పుడు మహీంద్రా తయారీ కర్మాగారాన్ని సందర్శించే అవకాశం లభించిందని, అక్కడే మహీంద్రా కార్లు ఎలా తయారవుతాయనేది చూసినట్లు ఆమె వెల్లడించింది. ఆ తరువాత తాను మహీంద్రా XUV700 కారుని కొనుగోలు చేయాలనుకుని.. ఆస్ట్రేలియాలోని కంపెనీ డీలర్షిప్ వద్ద డెలివరీ తీసుకుంది.

యూట్యూబ్ ఛానల్లో అప్‌లోడ్ అయిన వీడియోలో గ్రేస్ డీలర్షిప్ సందర్శించడం, అక్కడ తనకు నచ్చిన మిడ్‌నైట్ బ్లాక్ షేడ్‌లోని XUV700 డెలివరీ తీసుకోవడం వంటివి చూడవచ్చు. ఈ డీలర్షిప్ లోపల ఇతర కార్లు కూడా ఉండటం చూడవచ్చు.

ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన

ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం చూస్తుంటే ఓ కొత్త ఎనర్జీ వస్తుందని ట్వీట్ చేశారు. ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. వేలమంది వీక్షించిన వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు