సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో ఇవే టాప్

19 Feb, 2021 17:06 IST|Sakshi

న్యూఢిల్లీ: 2020లో భారతదేశంలో మారుతి సుజుకి డిజైర్, బజాజ్ పల్సర్ సరోకొత్త రికార్డు సృష్టించాయి. గత ఏడాది సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి డిజైర్, అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా బజాజ్ పల్సర్ నిలిచినట్లు "ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్రెండ్ రిపోర్ట్ 2020" ప్రకారం ఆన్ లైన్ ప్రీ ఓన్డ్ ఆటోమొబైల్ సంస్థ డ్రూమ్ వెల్లడించింది. 2020లో సెకండ్ హ్యాండ్ కార్ల సగటు అమ్మకపు ధర రూ.8,38,827గా ఉంది. అలాగే మోటార్ సైకిళ్ల సగటు ధర రూ.47,869గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 

2020లో విక్రయించిన వాడిన కార్లు, మోటార్‌ సైకిళ్ల సగటు యాజమాన్యం వ్యవధి 5ఏళ్ల నుంచి 7ఏళ్లగా ఉంది. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 34 శాతం పెట్రోల్ మోడల్స్, 65 శాతం డీజిల్ మోడల్స్, 1 శాతం పెట్రోల్ + సిఎన్జి మోడల్స్ ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కార్లు మొత్తం కార్ల అమ్మకాల్లో 63 శాతం ఉండగా, మిగిలిన కార్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉన్నాయి. నివేదిక ప్రకారం.. తెలుపు, సిల్వర్, బూడిద రంగు గల వాటిని ఎక్కువగా కొనుగోలుదారులు ఇష్ట్టపడ్డారు. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 36 శాతం భారతీయ కంపెనీలకు, 22 శాతం జపాన్ కంపెనీలకు, 18 శాతం జర్మన్ కంపెనీలకు, 12 శాతం దక్షిణ కొరియా కంపెనీలకు చెందినవని నివేదిక పేర్కొంది.

చదవండి:

బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!

మరిన్ని వార్తలు