2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి

23 Jul, 2022 15:18 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా  'గెట్ రెడీ ఫర్ ఏ ఎక్సైటింగ్ సర్ప్రైజ్'  అంటూ  కస్టమర్లను ఊరిస్తోంది.  ఆగస్ట్ 18 నుండి 22, 2022 వరకు క్యాలెండర్‌ను బ్లాక్ చేసుకోమంటూ శుక్రవారం సోషల్‌ మీడియాద్వారా కోరింది.  దీంతో  మారుతి  థర్డ్‌ జనరేషన్‌ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు కొత్త 2022 ఆల్టోను ఆవిష్కరించే అవకాశం ఉందని  ఊహాగానాలు వెల్లువెత్తాయి.

ఇండియలో అ‍త్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఖ్యాతి దక్కించుకున్న ఆల్టోను కొత్త డిజైన్‌, అప్‌డేటెడ్‌ ఫీచర్లతో సరికొత్తగా లాంచ్‌ చేయనుంది. కొత్త తరం ఆల్టోకి సంబంధించిన  కొన్ని ఫోటోలు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్‌ చల్‌ చేసిన సంగతి తెలిసిందే.  అయితే, కంపెనీ కొత్త ఆల్టో కోసం తుది లాంచ్ తేదీని నిర్ధారించలేదని  అధికారికంగా ప్రకటించకపోయినా,ఆగస్ట్  18 -22 మధ్య లాంచ్ అవుతుందని ఖచ్చితంగా తెలుస్తోంది.  

కొత్త తరం ఆల్టో కి సంబంధించిన  కొన్ని ఫోటోలు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో  హల్‌ చల్‌ చేసిన సంగతి  తెలిసిందే. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో  వస్తున్న కొత్త 998cసీసీ ఆల్టో K10 ఇంజన్ అమర్చిందట.  ఇది  66 bhp శక్తిని, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2022 ఆల్టో యొక్క ప్రారంభ ధర రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంటుందని అంచనా ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే.  రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో , డాట్సన్ రెడి-గో వంటి వాటికి గట్టిపోటీ ఇస్తుందని అంచనా.
 

ఇది కూడా చదవండి :  మహీంద్రాకు ఏమైంది? రెండోసారి ఆ కార్ల రీకాల్‌
ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12పై భారీ తగ్గింపు

మరిన్ని వార్తలు