నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్‌లో 5 లక్షల ఉద్యోగాలు!

26 Sep, 2023 19:10 IST|Sakshi

పండుగ సీజన్‌ అనగానే వ్యాపారాలు పెరుగుతాయని అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ కంపెనీలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తాయి. ఇందులో భాగంగానే ‘మీషో’ (Meesho) దాదాపు 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌, డీటీడీసీ, ఎలాస్టిక్‌ రన్‌, లోడ్‌షేర్‌, డెలివరీ, షాడోఫ్యాక్స్‌, ఎక్స్‌ప్రెస్‌బీస్‌ వంటి మరిన్ని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్‌లతో కొలాబరేషన్‌ ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించాలని మీషో భావిస్తోంది. ఇందులో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు టైర్ 3, 4 ప్రాంతాల్లో రానున్నట్లు సమాచారం.

పండుగ సీజన్‌లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఫుల్‌ఫిల్‌మెంట్‌ అండ్‌ ఎక్స్‌పీరియన్ష్ సీఎక్స్ఓ సౌరభ్ పాండే అన్నారు.

ఇదీ చదవండి: గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్‌గానా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!

మీషో సెల్లర్స్‌ పండుగ సీజన్‌లో 3 లక్షల మందికి పైగా సీజనల్ వర్కర్స్‌ను నియమించుకుంటారు. మీషో 80 శాతం మంది విక్రేతలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి, ఫ్యాషన్ యాక్ససరీస్, పండుగ అలంకరణ వంటి కొత్త కేటగిరీలను వెంచర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెరిగిన డిమాండ్‌ను ఆర్గనైజ్‌ చేయడానికి మీషో అదనపు స్లోరేజ్‌ స్పేస్‌ అద్దెకు తీసుకోవడంపై ద్రుష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం పండుగ నియామకాలు గిగ్ జాబ్‌లలో గణనీయమైన వృద్ధిని సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు టీమ్‌లీజ్ తెలిపింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై , హైదరాబాద్ వంటి టైర్-1 నగరాలతోపాటు టైర్ 3 నగరాల్లో కార్యకలాపాలను మరింత పెంచడానికి కంపెనీ సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్‌ఆర్‌పీ కంటే ఎక్కువ ధరతో..

ఇప్పటికే వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తన సప్లై చైన్‌లో 1,00,000 కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్‌కు ముందు, పండుగ సీజన్‌లో కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి ఫ్లిప్‌కార్ట్ తన పాన్-ఇండియా సప్లై చెయిన్‌లో మిలియన్ల కొద్దీ సీజనల్ ఉద్యోగాలను నియమించుకోవాలని చూస్తోంది.

మరిన్ని వార్తలు