‘జీతంలో జీవితం ఉండదు బ్రదర్‌’, రూ.3 కోట్ల జీతాన్ని వద్దనుకున్న ఉద్యోగి

10 Oct, 2023 21:23 IST|Sakshi

జీతంలో జీవితం ఉండదనుకున్నాడో ఏమో ఓ ఐటీ ఉద్యోగి తాను చేస్తున్న జాబ్‌కు రాజీనామా చేశాడు. రూ.కోట్లలో జీతం, పెద్ద ఉద్యోగాన్ని వదులుకున్నందుకు హాయిగా ఉందని అంటున్నాడు. ఇంతకీ ఆ ఉద్యోగి కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం పదండి 

ఎరిక్ యు (28) మెటా ఉద్యోగి. జీతం రూ.3 కోట్లు. అంతా బాగానే ఉంది. కానీ జాబ్‌ చేసే సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, చెవులు పగిలిపోయా శబ్ధాలు వచ్చేవి. అయినప్పటికీ, కోడింగ్‌తో కుస్తీ పట్టాడు. చివరికి తీవ్ర భయాందోళనల మధ్య మెటాకు రిజైన్‌ చేసి బయటకొచ్చాడు. ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లు లింక్డిన్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 

కష్టపడ్డా.. జాబ్‌ సంపాదించా
ఊహ తెలిసిన వయస్సు నుంచే ఫేస్‌బుక్‌లో పనిచేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గేట్లే కష్టపడ్డా. నా స్కిల్‌కు గూగుల్‌లో ఉద్యోగం వచ్చినా మెటాలో పనిచేసేందుకు మొగ్గు చూపా. ఎందుకంటే? మెటా క్యాంపస్‌ చాలా బాగుంటుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం తప్పని తర్వాతే తెలిసింది. భయంకరమైన ఒత్తిడికి గురైన తాను మెటాలో తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. 

A post shared by Eric Yu (@helloericyu)

అదృష్టాన్ని పరీక్షించి
ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఎంతో ప్రయత్నించా.  అదృష్టవశాత్తూ, మెటాలో పనిచేస్తున్న నా స్నేహితురాలు వాండా (ఇప్పుడు ఎరిక్‌ కాబోయే భార్య) నాలో ఆందోళల్ని గుర్తించింది. అందుకే ఆ ఒత్తిడి నుంచి బయట పడేలా ప్రయత్నించారు. ఇతర ఆదాయా మార్గాల్ని అన్వేషించా. చివరికి రియల్‌ ఎస్టేట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా. మెటా నుంచి బయటకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు. 

రూ.3 కోట్ల జీతం అంటే మాటలా
370,000 డాలర్లు (రూ.3 కోట్లు) ఉద్యోగాన్ని వదిలివేయడం పిచ్చి పనే అని నాకు తెలుసు. మెటాలో కొనసాగితే ఆర్ధిక భద్రత ఉండేది. అయితే అది నాకు సరైనది కాదని భావిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం, రియల్ ఎస్టేట్‌ రంగంలో పనిచేస్తున్న యుకు’ ఇలాగే కొనసాగుతానని మాత్రం చెప్పడం లేదు. భవిష్యత్‌ బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు లింక్డిన్‌ పోస్ట్‌లో ముగించాడు. 

మరిన్ని వార్తలు