ఎంజీ మోటార్‌ చార్జ్‌

4 Mar, 2022 13:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియా కొత్త విభాగాన్ని ప్రకటించింది. ఎంజీ చార్జ్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు కావాల్సిన చార్జింగ్‌ మౌలిక వసతులను కల్పిస్తారు. 1,000 రోజుల్లో దేశవ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో 1,000 చార్జింగ్‌ కేంద్రాలను స్థాపించాలని కంపెనీ నిర్ణయించింది. సూపర్‌ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకై ఎంజీ మోటార్‌ ఇటీవలే ఫోర్టమ్, టాటా పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
 

మరిన్ని వార్తలు