బడ్జెట్‌లో మైక్రోమాక్స్ నోట్ 1 మోడల్‌

11 Nov, 2020 08:52 IST|Sakshi

micromax in note1
డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
రెజల్యూషన్‌: 1080్ఠ2400 పిక్సెల్స్‌
ర్యామ్‌: 4జీబి
స్టోరేజ్‌: 128 జీబి
బ్యాటరీ: 5,000 ఎంఎహెచ్‌
కలర్‌ ఆప్షన్స్‌: గ్రీన్, వైట్‌
∙ఎల్‌యిడి ఫ్లాష్‌ ∙నైట్‌విజన్‌ సపోర్ట్‌
∙48–మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సర్‌
∙5–మెగా పిక్సెల్‌ సెకండరీ సెన్సర్‌
ధర: రూ.10,999

realme 7i
డిస్‌ప్లే: 6.5 అంగుళాలు
మెమోరీ: 64జీబి 4జీబి ర్యామ్‌ 128జీబి 4జీబి ర్యామ్‌ 128జీబి 8జీబి
బ్యాటరీ: 5000 ఎంఎహెచ్‌
రెజల్యూషన్‌: 720్ఠ1600 పిక్సెల్స్‌
బరువు: 188గ్రా,
కలర్‌: అరోరా గ్రీన్, పొలార్‌ బ్లూ
∙ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ 
∙గొరిల్లా గ్లాస్‌ 3
ధర: రూ.12,999 నుండి.

గ్యాడ్జెట్‌ బజార్‌

  • శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 3

సైజ్‌: 45 యంయం
బాడీ: గొరిల్లా గ్లాస్‌ డిఎక్స్‌
మెమోరీ: 8జీబి 1జీబి ర్యామ్‌
డిస్‌ప్లే: 360్ఠ360 రెజల్యూషన్‌
కలర్‌ ఆప్షన్స్‌: మిస్టిక్‌ బ్రాంజ్, మిస్టిక్‌ బ్లాక్, మిస్టిక్‌ వైట్‌
∙టైటానియం ఫ్రేమ్‌ ∙వాటర్‌ రెసిస్టెంట్‌                ∙ ఎల్‌టీయి కనెక్టివిటీ
∙శాంసంగ్‌ పే ∙సీజీ సర్టిఫైడ్‌ ∙ బ్లడ్‌ ప్రెజర్‌ మానిటర్‌ ∙లౌడ్‌ స్పీకర్‌
ధర: రూ.29,990

సోషల్‌ మీడియా

  • ఆతరువాత....ఇక మాయమే!

టెలిగ్రామ్‌ ‘సెల్ఫ్‌ డిస్ట్రక్షన్‌ మెసేజెస్‌’ ఫీచర్‌ తరహాలో సరికొత్త ఫీచన్‌ను తీసుకురానుంది వాట్సాప్‌. వ్యక్తులు లేదా గ్రూప్‌లకు పంపిన మెసేజ్‌ ఏడు రోజుల తరువాత దానికదే మాయమవుతుంది. బానే ఉందిగానీ ఆ టైమ్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేయనివారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం రావచ్చు. అలాంటి వారి కోసం ‘టెంపరరీ మెసేజ్‌’ కనిపిస్తుంది. ఎనేబుల్, డిసేబుల్‌ ఆప్షన్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.
మరో విషయం ఏమిటంటే, వృథాగా పడి ఉన్న మెసేజ్‌లను మరింత సులభంగా డిలిట్‌ చేయడానికి ‘స్టోరేజ్‌ మెనేజ్‌మెంట్‌’ టూల్‌ను అప్‌డెట్‌ చేస్తుంది వాట్సాప్‌. రిడిజైన్‌ చేసిన టూల్‌ ‘మెనేజ్‌ స్టోరేజ్‌’ సబ్‌ మేనూలో అందుబాటులో ఉండనుంది.

  • ఎందుకంటే...ఇందుకంటా!

    ‘డిన్నర్‌ పార్టీ కోసం’ ‘హాస్పిటల్‌కు వెళ్లాలి’ ‘సురేష్‌ వచ్చాడు’....కాల్‌ చేయడానికి ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. పీకలలోతు పనుల్లో మునిగిపోయి ముఖ్యమైన ‘కాల్‌’ను ఇగ్నోర్‌ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ‘కాల్‌’కు ముఖ్య కారణం సూక్ష్మంగా చెప్పేస్తే ఇరుపక్షాలకి మేలే కదా. కాల్‌పికప్‌ రేట్‌ కూడా పెగుతుంది. ఈ ఉద్దేశంతోనే స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ ట్రూ కాలర్‌ ‘కాల్‌ రీజన్‌’ అనే కొత్త అప్లికేషన్‌ను తీసుకువస్తుంది. ‘సోషల్‌ మీడియాలో నెటిజెన్స్‌ పాప్‌లర్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కాల్‌ రీజన్‌ ఫీచర్‌ను తీసుకువస్తున్నాం’ అని తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది ట్రూ కాలర్‌.
మరిన్ని వార్తలు