ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ జోరు చూడతరమా!

4 Aug, 2020 14:55 IST|Sakshi

జాబితాలో ఎస్సెల్‌ ప్రొప్యాక్‌, జీఈ షిప్పింగ్‌

క్లాప్లిన్‌ పాయింట్‌ ల్యాబ్‌

ఎస్‌ఎంఎస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఇండియా

రినైసన్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌

52 వారాలను తాకిన పలు కౌంటర్లు

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 680 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు మార్కెట్లను మించుతూ దౌడు తీస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో  ఎస్సెల్‌ ప్రొప్యాక్‌, జీఈ షిప్పింగ్‌, క్లాప్లిన్‌ పాయింట్‌ ల్యాబ్‌, ఎస్‌ఎంఎస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఇండియా, రినైసన్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం...

 ఎస్సెల్‌ ప్రొప్యాక్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం దూసుకెళ్లింది. రూ. 262 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 280 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 23,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా లక్ష షేర్లు చేతులు మారాయి.

జీఈ షిప్పింగ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 274 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 22,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 80,000 షేర్లు చేతులు మారాయి.

క్లాప్లిన్‌ పాయింట్‌ ల్యాబ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం జంప్‌చేసి రూ. 509 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 519 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 39,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా లక్ష షేర్లు చేతులు మారాయి.

ఎస్‌ఎంఎస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 16 శాతం దూసుకెళ్లింది. రూ. 468 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 479 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,500 షేర్లు మాత్రమేకాగా.. మధ్యాహ్నానికల్లా 28,000 షేర్లు చేతులు మారాయి.

రినైసన్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం జంప్‌ చేసి రూ. 280 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 298 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 3,000 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా