భారత్‌లో బెస్ట్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ ఏదో తెలుసా?

10 May, 2023 09:14 IST|Sakshi

ముంబై: దేశీయంగా ఉత్తమ 5జీ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా మోటరోలా నిల్చింది. టెక్నాలజీ రీసెర్చ్, కన్సల్టింగ్‌ సంస్థ టెక్‌ఆర్క్‌ రూపొందించిన సర్వే రూ. 10,000–30,000 ధర శ్రేణిలోని ఫోన్ల కేటగిరీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ప్రధానంగా కనెక్టివిటీ, కవరేజీ, సామర్థ్యాలు అనే మూడు కీలక అంశాల ప్రాతిపదికన ఈ సర్వేలో ర్యాంకులను కేటాయించినట్లు మోటరోలా తెలిపింది. ఈ మూడు విభాగాల్లోనూ తమ స్మార్ట్‌ఫోన్లు మెరుగైన పనితీరు కనపర్చినట్లు వివరించింది.    

చదవండి👉 ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్‌.. డబుల్‌ శాలరీలను ఆఫర్‌ చేస్తున్న కంపెనీలు! 

మరిన్ని వార్తలు