Netflix: కొంచెం ఇష్టం..కొంచెం కష్టం,యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ షాక్‌!

13 May, 2022 19:06 IST|Sakshi

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారులకు భారీ షాకివ్వనుంది. ప్రస్తుతం మూడు దేశాల్లో మాత్రమే పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై నెట్‌ ఫ్లిక్స్‌ అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అన్నీ దేశాల్లో పాస్‌ వర్డ్‌ షేరింగ్‌పై డబ్బులు వసూలు చేయాలని భావిస్తోంది. 


న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం..చీలీ, కోస్టరికా,పెరులో నెట్‌ఫ్లిక్స్‌ వినియోగించే యూజర్లు వారి అకౌంట్‌ క్రెడియన్షియల్స్‌ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫార్వర్డ్‌  చేయాలంటే.. అందుకు అదనంగా 2.99డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సర్‌ ఛార్జీలను మిగిలిన దేశాల్లో సైతం వసూలు చేయనుంది. 

ఈ ఏడాది విడుదలైన మొదటి త్రైమాసికంలో(జనవరి,ఫిబ్రవరి, మార్చి) 200,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. రానున్న నెలల్లో మరో 2మిలియన్‌ల మంది సబ్‌స్క్రిప్షన్‌లను కోల్పోవచ్చని అంచనా వేసింది. కాబట్టే మార్కెట్ విలువ నుండి సుమారు $55 బిలియన్ల ఆదాయం తగ్గిపోయింది.

కొంచెం ఇష్టం..కొంచెం కష్టం
గతనెల క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో వాటాదారులకు రాసిన లేఖలో సుమారు 100 మిలియన్ల మంది యూజర్లు పాస్‌వర్డ్‌ను షేరింగ్‌ చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. అందుకే సంస‍్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై సర్‌ ఛార్జీలను వసూలు చేయనుంది.అదే జరిగితే సబ్‌స్క్రిప్షన్‌ సంఖ్య తగ్గిపోతుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి విరుగుడుగా సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు తగ్గించి..ఈ ఏడాది (2022) చివరి నాటికి పాస్‌వర్డ్‌ షేర్‌పై సర్‌ చార్జీలను విధించాలని చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే సబ్‌స్క్రిప్షన్‌ను కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు షేర్‌ చేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి👉 ఆ కక్కుర్తితో వందల కోట్ల హాంఫట్,నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారులారా బుద్ధొచ్చింది!

మరిన్ని వార్తలు