Netflix Password Sharing End: భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ బంద్.. ఇక వారికి మాత్రమే!

20 Jul, 2023 11:30 IST|Sakshi

Netflix Password Sharing End: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారతదేశంలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను ముగించినట్లు ప్రకటించింది. ఒక వ్యక్తి మాత్రమే ఒక ఖాతాను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్‌ చేసే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు ఈ విధానానికి చరమగీతం పాడింది. సంస్థ ఈ నిర్ణయం గురించి గతంలోనే వెల్లడించింది. కాగా ఇప్పటికి అమలు చేసింది.

ఒక కుటుంబంలో నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణ సమయంలో కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉండేలా ఒక కొత్త ఫీచర్ అందించనున్నట్లు స్ట్రీమింగ్ దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఇమెయిల్‌ ప్రారంభించినున్నట్లు కంపెనీ తెలిపింది.

(ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..)

గత మేలో నెట్‌ఫ్లిక్స్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ వంటి ప్రముఖ మార్కెట్‌లతో సహా 100 కంటే ఎక్కువ దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులను విధించింది. కాగా ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ రూల్స్ అమలులోకి వచ్చేసాయి. సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక డేటా ప్రకారం ముగిసిన త్రైమాసికంలో మొత్తం 238 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో 1.5 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు