పిన్న వయసులోనే రూ.110 కోట్లు విరాళం

3 Nov, 2023 14:59 IST|Sakshi

జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ఆయన సోదరుడు కంపెనీ సీఈఓ నితిన్‌ కామత్‌ 2023 ఏడాదికి గాను రూ.110 కోట్లు విరాళం ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ 2023లో చోటు సంపాదించారు. అయితే ఈ లిస్ట్‌లో చోటు సాధించిన వారిలో నిఖిల్‌ కామత్‌ పిన్న వయస్కుడు. 

గడిచిన ఏడాదిలో ఇద్దరు సోదరులు సమిష్టిగా తమ విరాళాన్ని 300 శాతం పెంచి రూ.100 కోట్ల దాతృత్వాన్ని ప్రకటించినట్లు ఎడెల్‌గివ్‌ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 వెల్లడించింది. అయితే ఈ ఏడాది దేశంలో తొమ్మిదో అతిపెద్ద దాతగా వీరు వార్తల్లో నిలిచారు. అయితే 2021లో వీరిద్దరూ తమ వ్యక్తిగత సంపదలో నాలుగింట ఒక వంతు విరాళంగా ఇవ్వాలని ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో రూ.750 కోట్లను తిరిగి ఇచ్చే ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు. 

వాతావరణ మార్పు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు తన సంపదలో 50 శాతం విరాళమిస్తానని గతంలో నిఖిల్ కామత్‌ ప్రకటించారు. వారెన్‌బఫెట్‌, మిలిందాగేట్స్‌, బిల్‌గేట్స్‌ స్థాపించిన గివింగ్‌ప్లెడ్జ్‌పై నిఖిల్‌కామత్‌ సంతకం చేశారు. ఇందులో చేరిన నాలుగో భారతీయుడు కామత్‌. విప్రో మాజీ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్‌ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా, నందన్ నీలేకని       తర్వాత నిఖిల్‌ గివింగ్‌ప్లెడ్జ్‌ కమ్యునిటీలో చేరారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం నిఖిల్‌ మొత్తం రూ.27వేల కోట్లు విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. నిఖిల్ తన సొంత ఫౌండేషన్ యంగ్ ఇండియన్ ఫిలాంత్రోపిక్ ప్లెడ్జ్ (వైఐపీపీ) ద్వారా కొన్ని స్టార్టప్ కంపెనీలతో కలిసి వారి నికర విలువలో కనీసం 25 శాతాన్ని దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు