రూ.2 వేల నోట్లు: షాకింగ్‌ ఆర్టీఐ రిప్లై

9 Nov, 2022 14:23 IST|Sakshi

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల కరెన్సీ నోట్లకు సంబంధించి  ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. 2019-20, 2020-21, 2021-22లో ఒక్క రూ.2 వేల నోటు కూడా ముద్రించలేదట. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్ ఈ విషయా​న్ని వెల్లడించింది. (Audi Q5Special Edition:స్పెషల్‌ ప్రైస్‌..లిమిటెడ్‌ పీరియడ్‌, త్వరపడండి!)

2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్‌ 2వేల రూపాయల నోట్లను ముద్రించగా, ఈ సంఖ్య 2017-18లో 111.507మిలియన్లు  తగ్గిపోయిందనీ, అలాగే  2018-19 ఏడాదిలో ఇది  46.690 మిలియన్ నోట్లుగా ఉందని  ఐఏఎన్‌ఎస్‌  దాఖలు చేసిన RTI  క్వెరీ లో తెలిపింది.  

మరోవైపు ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం దేశంలో స్వాధీనం చేసుకున్న  2 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 2016-2020 మధ్య 2,272 నుండి 2,44,834కు గణనీయంగా పెరిగిందని పార్లమెంటులో ఇటీవల (ఆగస్టు 1న) సర్కార్‌ తెలిపింది.డేటా ప్రకారం, 2016లో దేశంలో పట్టుబడిన మొత్తం రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 2,272 కాగా, 2017లో 74,898కి పెరిగి 2018లో 54,776కి తగ్గింది. 2019లో ఈ సంఖ్యలు 90,566గా  ఉండగా, 2020గా ఈ సంఖ్య ఏకంగా  2,44,834గా ఉంది.  (SuperMeteor 650: రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ సూపర్‌ బైక్‌,సూపర్‌ ఫీచర్లతో)

కాగా నవంబర్ 8, 2016న అప్పటికి చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోటును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.


 

మరిన్ని వార్తలు