కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త!

4 Jul, 2021 19:55 IST|Sakshi

మీరు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త. ఇక లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాల(ఆర్టీఓ) వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్టు కూడా చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా ఓ ముసాయిదాను తీసుకొచ్చింది. ఈ ముసాయిదా ప్రకారం జూలై 1 నుంచి కొత్త నిబందనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం లైసెన్స్ కోరుకునే వ్యక్తి ఏదైనా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలోనే ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్‌గా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 

అలాంటి సందర్భంలోనే డ్రైవింగ్ లెసెన్స్ జారీ కోసం ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ శిక్షణ కేంద్రాల వద్ద సిమ్యులేటర్లు, దరఖాస్తుదారులకు హైక్వాలిటీ ట్రైనింగ్ కోసం ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ను కలిగి ఉంటాయి. గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్ లో లైట్ మోటార్ వేహికల్ కొరకు డ్రైవింగ్ కోర్సు ప్రారంభం అయిన తేదీ నుంచి గరిష్టంగా నాలుగు వారాల వ్యవధిలో 29 గంటల పాటు రన్ అవుతుందని నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టీసు కూడా ఉంటుంది. 

అలాగే, శిక్షణ కేంద్రాలలో మీడియం, హెవీ మోటార్ వేహికల్ డ్రైవింగ్ కోర్సుల కాలవ్యవధి 38 గంటలు(ఆరు వారాల వ్యవధిలో). ఇందులో రెండు సిగ్మెంట్లు ఉంటాయి.. ఒకటి థియరీ, రెండవది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో కొన్ని బేసిక్స్ కూడా నేర్పిస్తారు. రోడ్డుపై ఇతరులతో నైతికంగా, మర్యాదపూర్వకంగా ఎలా నడుచుకోవలో వంటి కొన్ని ప్రాథమికాంశాలను ఈ శిక్షణలో నేర్పిస్తారు. ఈ కోర్సు వల్ల రహదారిపైకి నైపుణ్యం కలిగిన డ్రైవర్లు వస్తారు అని కేంద్రం పేర్కొంది. అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల కొరకు మంజూరు చేయబడ్డ అక్రిడిటేషన్ ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. తర్వాత పునరుద్దరించుకోవచ్చు.

చదవండి: ప్రతి నెల రూ.55 పొదుపుతో.. నెల నెల రూ.3000 పెన్షన్

మరిన్ని వార్తలు