మీ దగ్గర ఈ 25 పైసల నాణెం ఉంటే లక్షాధికారులే

28 Apr, 2021 20:58 IST|Sakshi

ప్రకటించిన ఇండియా మార్ట్‌

న్యూఢిల్లీ: మీ దగ్గర పాత 25 పైసల నాణెం ఉందా.. ఒకవేళ ఉంటే మీరు లక్షాధికారులు కావచ్చు అంటుంది ఇండయామార్ట్‌ వెబ్‌సైట్‌. పావలా ఉంటే లక్షాధికారులు ఎలా అవుతారా అని ఆలోచిస్తున్నారా అయితే ఇది చదవండి. ఇండియామార్ట్‌ ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. మీ దగ్గర గనుక  1992 కాలం నాటి ఖడ్గ మృగం ఉన్న 25 పైసల కాయిన్‌ ఉంటే.. మీరు లక్షాధికారులే అని తెలిపింది. ఇందుకు గాను మీరు ఆ కాయిన్‌ను రెండు వైపులా ఫోటో తీసి.. ఇండియామార్ట్‌. కామ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అక్కడ దీన్ని వేలం వేస్తారు. ఎంత ఎక్కువ ధర పలుకుతుందనేది బిడ్డర్ల మీద ఆధారపడి ఉంటుంది. అయితే గరిష్టంగా 1.50 లక్షల రూపాయల వరకు పలకవచ్చని భావిస్తున్నారు. ఈ 25 పైసల నాణెం తప్పకుండా వెండి రంగులో ఉండాలి అని తెలిపింది.

ఇక మీ దగ్గర పాత 5,10 పైసల నాణేలు ఉంటే వాటిని ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌లో అమ్మి డబ్బు చేసుకోవచ్చు. అలానే ఎవరికైనా పాత నాణేల మీద ఆసక్తి ఉంటే ఇక్కడ కొనవచ్చు. ఇక  ఇండియామార్ట్ భారతదేశంలోకెల్లా అతిపెద్ద ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఒకటి. "ఇండియామార్ట్ 10 కోట్లకు పైగా  కొనుగోలుదారులు, 60 లక్షలకు పైగా సరఫరాదారులకు సేవలు అందిస్తోంది. మీరు రిటైలర్, తయారీదారు అయినా, ఆన్‌లైన్‌లో వ్యాపారం పెరగడానికి ఇండియామార్ట్ మంచి గమ్య స్థానం అని దాని వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక ఇది ఎంత వాస్తవమనేది చూడాలి.

చదవండి: రూ.5 కాయిన్‌కు రూ.5 లక్షలట! 

మరిన్ని వార్తలు