Telugu Language On British Coin: బ్రిటిష్‌ వారు 'తెలుగు భాష'కు ఇచ్చిన స్థానం చూసి..గాంధీనే కంగుతిన్నారు!

15 Sep, 2023 17:31 IST|Sakshi

తెలగుకు తెగులు పుట్టిస్తున్నారని ఏవేవో కబుర్లు, లెక్చర్లు చెప్పేస్తుంటాం. తెలుగు దినోత్సవం అంటూ.. ఆరోజు ఆహో ఓహో అని తెలుగు గొప్పదనం చెప్పేసి మురిసిపోతాం. ఆ వైభవాన్ని తీసుకొచ్చే యత్నం చెయ్యం. ఆ భాషకు మహోన్నత స్థానం ఇ‍చ్చేలా చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. కనీసం నాటి కవులను తలుచుకోం. పోనీ}.. తెలుగు మాష్టర్లని గౌరవిస్తామా అంటే లేదు వారంటే చులకన!. కానీ అవకాశం వస్తే మాత్రం తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టేస్తాం. మనల్ని బానిసలుగా చేసుకుని పాలించిన బ్రిటిష్‌ వాళ్లే నయం. పరాయి వాళ్లైన మన భాషకు ఇచ్చిన విలువ చూసైనా సిగ్గుపడతారేమో చూద్దాం. ఇంతకీ వాళ్లు మన భాషకు ఎలా పట్టం కట్టారో తెలుసా..!

మన నాణెం పై తెలుగు భాష. (బ్రిటిష్ వాళ్లు 1936లోనే తెలుగుకు ఎలా పట్టం కట్టారో చూడండి.) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, డాక్టర్‌ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ”ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య” ను సభ దృష్టికి తెచ్చారు. "పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం..ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా ‘మద్రాసీ’లు కదా?" అన్నారు గాంధీ గారు ఎగతాళిగా!

వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి "అణా కాసు" ను తీసి ”గాంధీ జీ ! దీనిపై ‘ఒక అణా‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ  అండ్‌ తెలుగులోనూ ‘ఒక అణా‘ అని రాసి ఉంది. అది కూడా బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం! (అప్పటికి భారత దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) "నాణెంపై తెలుగుభాషలో 'ఒక-అణా' అని ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే?" అంటూ చురక వేశారు. గాంధీ గారితో పాటూ... కొంతమంది తెలుగు మాతృబాష కాని వారు కూడా ఆశ్చర్య పోయారు.

(చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!)

మరిన్ని వార్తలు